
ఐఎస్‌ఎల్ లోగో ఆవిష్కరణ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ అధికారిక లోగో ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా జరిగింది.
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ అధికారిక లోగో ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు ఐఎంజీ-రిలయన్స్ చైర్‌పర్సన్ నీతా అంబానీ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు. తరగతి గదుల్లో నేర్చుకోని ఎన్నో పాఠాలను తనకు ఆట నేర్పిందని కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ అన్నాడు.
అలాగే ఈ కార్యక్రమంలో ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, హీరో మోటార్‌కార్ప్ సీఎండీ పవన్ ముంజల్, స్టార్ ఇండియా గ్రూప్ సీఓఓ సంజయ్ గుప్తాతో పాటు ఆయా జట్ల ప్రతినిధులు అభిషేక్ బచ్చన్ (చెన్నై), రణబీర్ కపూర్ (ముంబై), జాన్ అబ్రహం (నార్త్ ఈస్ట్), వరుణ్ ధావన్ (గోవా), ఉత్సవ్ పరేక్ (కోల్‌కతా), సమీర్ మన్‌చందా (ఢిల్లీ), కపిల్ వధావన్ (పుణే) పాల్గొన్నారు. అక్టోబర్‌లో ఈ లీగ్ ప్రారంభం కానుంది.