ఇషాంత్‌ ఇక పంజాబ్‌ కింగ్‌ | Ishant Sharma picked by Kings XI Punjab | Sakshi
Sakshi News home page

ఇషాంత్‌ ఇక పంజాబ్‌ కింగ్‌

Apr 4 2017 10:58 PM | Updated on Sep 5 2017 7:56 AM

ఇషాంత్‌ ఇక పంజాబ్‌ కింగ్‌

ఇషాంత్‌ ఇక పంజాబ్‌ కింగ్‌

ఐపీఎల్‌–10 వేలంలో అమ్ముడుపోని భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మకు ఊరట దక్కింది.

మొహాలి: ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని భారత సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మకు మరో అవకాశం దక్కింది. ఐపీఎల్‌–10 కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  ఇషాంత్‌ను తమ జట్టులోకి తీసుకుంది. పంజాబ్‌ జట్టులో యువ బౌలర్లే ఎక్కువ మంది ఉండటంతో అనుభవజ్ఞుడైన బౌలర్‌ కోసం అన్వేషిస్తూ ఇషాంత్‌కు అవకాశం కల్పించింది. జట్టు మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్వయంగా చొరవ తీసుకొని ఇషాంత్‌ను ఎంచుకునేలా చేశారు.

 

రెండు రోజుల క్రితం వీరూ తనతో మాట్లాడారని, ఆ తర్వాతే పంజాబ్‌ జట్టు తనను తీసుకుందని ఇషాంత్‌ వెల్లడించాడు. 77 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్‌ గతంలో కోల్‌కతా, హైదరాబాద్, పుణే జట్ల తరఫున ఐపీఎల్‌ ఆడాడు. మరో వైపు చికెన్‌ పాక్స్‌ కారణంగా ఢిల్లీ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement