సంచలనం సృష్టించిన చిన్నజట్టు | ireland beats west indies | Sakshi
Sakshi News home page

సంచలనం సృష్టించిన చిన్నజట్టు

Feb 16 2015 11:09 AM | Updated on Sep 2 2017 9:26 PM

సంచలనం సృష్టించిన చిన్నజట్టు

సంచలనం సృష్టించిన చిన్నజట్టు

11వ ప్రపంచకప్ లో ఐర్లాండ్ జట్టు సంచలనం నమోదు చేసింది. తమ కంటే మెరుగైన వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది.

నెల్సన్: 11వ ప్రపంచకప్ లో ఐర్లాండ్ జట్టు సంచలనం నమోదు చేసింది. తమ కంటే మెరుగైన వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్ విండీస్ పై ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయంగా చేరుకుంది. మరో 25 బంతులు మిగులుండగానే గెలుపు అందుకుంది. 45.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. అయితే చివర్లో తడబడినప్పటికీ ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది.

పాల్ స్టిర్లింగ్(92), జొయస్(84), ఓబ్రిన్(79) చెలరేగి ఆడారు. స్టిర్లింగ్ కొద్దిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. గేల్, శామ్యూల్ చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 304 పరుగులు చేసింది. సిమన్స్(102) సెంచరీ చేశాడు. జట్టు ఓడిపోవడంతో అతడి సెంచరీ వృధా అయింది. ఇప్పటివరకు ఐర్లాండ్ తో ఆడిన ఐదు వన్డేల్లో విండీస్ కు ఇది మొదటి ఓటమి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement