ఆధిక్యంలో కర్ణాటక | Irani Cup: Karnataka lead Rest of India by 321 runs post Day 3 | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో కర్ణాటక

Mar 20 2015 1:55 AM | Updated on Sep 2 2017 11:06 PM

ఆధిక్యంలో కర్ణాటక

ఆధిక్యంలో కర్ణాటక

రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటక జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.

- రెండో ఇన్నింగ్స్‌లో 341/6
- రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇరానీ కప్

బెంగళూరు: రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటక జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో జోరు కనబరచడంతో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో ఆరు వికెట్లకు 341 పరుగులు చేసింది. దీంతో జట్టుకు 321 పరుగుల ఆధిక్యం లభించింది.

రవికుమార్ సమర్థ్ (159 బంతుల్లో 81; 10 ఫోర్లు), కరుణ్ నాయర్ (123 బంతుల్లో 80; 12 ఫోర్లు), మనీష్ పాండే (121 బంతుల్లో 73 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రీజులో పాండేతో పాటు కెప్టెన్ వినయ్ (47 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు. రెస్ట్ బౌలర్లు వరుణ్ ఆరోన్, ఓజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement