డ్యాన్స్‌ అండ్‌ డ్యాన్స్‌! | IPL 2018 opening ceremony: Hrithik, Jacqueline, others to shake a leg | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ అండ్‌ డ్యాన్స్‌!

Apr 7 2018 12:53 AM | Updated on Aug 21 2019 10:13 AM

IPL 2018 opening ceremony: Hrithik, Jacqueline, others to shake a leg - Sakshi

ముంబై: ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ వినోదానికి చిరునామా. అయితే ప్రతీ ఏటా మ్యాచ్‌లకు ముందు ఆరంభ వేడుకలు కూడా అంతే స్థాయిలో అభిమానులను అలరిస్తూ వచ్చాయి. ఈసారి కూడా లీగ్‌ ప్రారంభోత్సవం అదిరిపోతుందని బీసీసీఐ హామీ ఇస్తోంది. గతంతో పోలిస్తే ఒక రోజు ముందు కాకుండా తొలి మ్యాచ్‌ రోజే ప్రారంభోత్సవం జరుగుతుండటం ఒక్కటే మారింది. ఇది మినహా వినోదంలో ఏమాత్రం లోటు ఉండదనేది నిర్వాహకులు మాట. బాలీవుడ్‌లో అత్యుత్తమ డ్యాన్సింగ్‌ హీరోలుగా గుర్తింపు ఉన్న హృతిక్‌ రోషన్, వరుణ్‌ ధావన్‌ తమ ప్రదర్శనతో అలరించేందుకు సిద్ధమయ్యారు. డ్యాన్స్‌కే అడుగులు నేర్పించగల ప్రభుదేవా కూడా వీరితో జత కలిస్తే ఇక ఫ్లోర్‌ అదిరిపోవడం ఖాయం!  

ఆటపాటల్లో గ్లామర్‌కు కూడా లోటు లేకుండా ఉండేందుకు మరో ఇద్దరు హీరోయిన్లతో స్పెషల్‌ షో ఈ వేడుకల్లో మరో ఆకర్షణ. సూపర్‌ హిట్‌ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేసేందుకు తమన్నా భాటియా, జాక్‌లిన్‌ ఫెర్నాండెజ్‌ రెడీ. పాపులర్‌ సింగర్‌ మికా సింగ్‌ కూడా తన గొంతు సవరించుకొని పంజాబీ–హిందీ పాటలతో అలరించనున్నాడు. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు టాస్‌ వేసే సమయం 7.30 వరకు కొనసాగుతాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement