వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో తెలుగుతేజం దూసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొప్పర్తి శిరీష కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు గెలిచింది.
న్యూఢిల్లీ: వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో తెలుగుతేజం దూసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొప్పర్తి శిరీష కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు గెలిచింది. మలేసియాలోని పెనాంగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శిరీష జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో ఈ పతకాలు నెగ్గింది. స్నాచ్‌లో 73 కేజీల బరువెత్తి మొదటి స్థానంలో నిలిచిన ఆమె... క్లీన్ అండ్ జెర్క్‌లో 95 కేజీల బరువెత్తి మరో స్వర్ణాన్ని గెలిచింది.
మొత్తం 168 కేజీలతో మూడో పసిడి పతకం గెలుచుకుంది. యూత్ మహిళల 58 కేజీల విభాగంలో జోయతిమాల్ కూడా మూడు స్వర్ణాలు గెలిచింది. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాటి సేథి మూడు కాంస్యాలు గెలిచింది. దీంతో బుధవారం భారత్ ఖాతాలో మొత్తం ఆరు స్వర్ణాలు, మూడు కాంస్యాలు చేరాయి. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటివరకు భారత్‌కు మొత్తం 48 పతకాలు రాగా... ఇందులో 26 స్వర్ణాలు ఉండటం విశేషం.