ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం | Indian shooters bag bronze in 10m Air Pistol Men’s Team | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం

Sep 21 2014 10:07 AM | Updated on Sep 2 2017 1:44 PM

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం

ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. రెండో రోజు షూటింగ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది.

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. రెండో రోజు షూటింగ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య  పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్పా కూడిన బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది.

ఈ టోర్నిలో జీతూ రాయ్ రెండో పతకం సాధించడం విశేషం. తొలిరోజు అతడు స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అతడు పసిడి పతకం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి కాంస్యం కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement