అపూర్వీకి కాంస్యం | Indian shooter Apurvi Chandela qualifies for Rio Olympics | Sakshi
Sakshi News home page

అపూర్వీకి కాంస్యం

Apr 12 2015 1:23 AM | Updated on Sep 3 2017 12:10 AM

అపూర్వీకి కాంస్యం

అపూర్వీకి కాంస్యం

భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా ఒకే గురికి రెండు లక్ష్యాలను సాధించింది.

రియో ఒలింపిక్స్‌కు అర్హత
చాంగ్‌వన్ (కొరియా): భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా ఒకే గురికి రెండు లక్ష్యాలను సాధించింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఈ రాజస్థాన్ షూటర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్స్‌లో అపూర్వీ 185.6 పాయింట్ల స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్నెజానా పెజ్‌సిచ్ (క్రొయేషియా-209.1 పాయింట్లు) స్వర్ణం, ఇవానా మఖ్‌సిమోవిచ్ (సెర్బియా-207.7 పాయింట్లు) రజతం సాధించారు. జీతూ రాయ్ తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో భారతీయ షూటర్ అపూర్వీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement