‘లక్ష’ణమైన క్యాచ్ | Indian-origin man takes 100,000 New Zealand dollar catch | Sakshi
Sakshi News home page

‘లక్ష’ణమైన క్యాచ్

Jan 23 2014 12:52 AM | Updated on Sep 2 2017 2:53 AM

‘లక్ష’ణమైన క్యాచ్

‘లక్ష’ణమైన క్యాచ్

ఎవరైనా సరే చకచకా లక్షాధికారి కావాలంటే రెండు చేతుల సంపాదించాలి. కానీ 23 ఏళ్ల జతీందర్ మాత్రం అక్షరాలా రూ.52 లక్షలు ఒక్క చేతితోనే సంపాదిం చాడు.

వెల్లింగ్టన్: ఎవరైనా సరే చకచకా లక్షాధికారి కావాలంటే రెండు చేతుల సంపాదించాలి. కానీ 23 ఏళ్ల జతీందర్ మాత్రం అక్షరాలా రూ.52 లక్షలు ఒక్క చేతితోనే సంపాదిం చాడు. అదీ... ఒక్క మ్యాచ్‌లో... ఒక్క క్యాచ్‌తో..! అదెలాగంటే ఇది చదవండి మరీ... న్యూజిలాండ్‌లో క్రికెట్ ప్రేక్షకులకు ఓ పోటీ పెడతారు. అందరికీ కాదు కేవలం ముందుగా నమోదు చేసుకున్న ప్రేక్షకులకే ఈ అవకాశం.


వీళ్లకు ఓ టీ షర్ట్ ఇస్తారు. అది వేసుకొని బ్యాట్స్‌మన్ కొట్టిన భారీ సిక్సర్‌ను ప్రేక్షకుల స్టాండ్‌లో ఉన్న సదరు రిజిస్టర్డ్ ప్రేక్షకుడు ఒంటి చేత్తో పడితే అతనికి లక్ష న్యూజిలాండ్ డాలర్లు బహుమతిగా ఇస్తారు. భారత్, కివీస్ రెండో వన్డేలో ఇషాంత్ బౌలింగ్‌లో ఆతిథ్య జట్టు ఆల్‌రౌండర్ అండర్సన్ కొట్టిన భారీ షాట్‌ను హమిల్టన్ నివాసి జతీం దర్ పట్టుకున్నాడు. ఇంతకుముందు ఇదే నెలలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ నజరానాను మైకేల్ మార్టన్ అనే ప్రేక్షకుడు అందుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement