బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ | India win the toss and elect to bat | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Jan 12 2016 8:24 AM | Updated on Sep 3 2017 3:33 PM

బరిందర్ కు వన్డే క్యాప్ అందజేస్తున్న ధోని

బరిందర్ కు వన్డే క్యాప్ అందజేస్తున్న ధోని

ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కొత్త బౌలర్ బరిందర్ శరణ్ తొలిసారిగా బరిలోకి దిగుతున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే క్యాప్ అందజేశాడు. రవిశాస్త్రి, సహచర ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు. సింగ్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రిషీ ధావన్ ఈరోజు మ్యాచ్ లో ఆడడం లేదు. అటు కంగారూ టీమ్ లో కూడా ఇద్దరు కొత్త బౌలర్లు పారిస్, బోలాండ్‌లను ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నారు.

పెర్త్ లో ఆడడం సంతోషంగా ఉందని టాస్ సందర్భంగా ధోని చెప్పాడు. ఇక్కడి వాతావరణం కొద్దిగా వేడిగా ఉందన్నాడు. టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని ఆసీస్ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కిందన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement