భారత్‌కు ‘హ్యాట్రిక్‌’ ఓటమి

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ ఫెడ్‌ కప్‌ ఆసియా ఓసియానియా ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత అండర్‌–16 బాలికల జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3తో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. తెలంగాణ క్రీడాకారిణులు సంజన సిరిమల్ల, భక్తి షా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సంజన 1–6, 4–6తో అనా తమానిక (న్యూజిలాండ్‌) చేతిలో ఓటమి చవిచూసింది. సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో భక్తి షా 3–6, 2–6తో జేడ్‌ ఓట్‌వే (న్యూజిలాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. నామమాత్రమైన డబుల్స్‌ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 4–6తో అబిగెయిల్‌ మేసన్‌–జేడ్‌ ఓట్‌వే (న్యూజిలాండ్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఇక 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top