ఫైనల్లో భారత్‌ 

india reach the final - Sakshi

హామిల్టన్‌:    నాలుగుదేశాల ఇన్విటేషనల్‌ హాకీ టోర్నమెంట్‌ రెండో అంచెలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌పై 4–2తో గెలుపొందింది. తొలి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బెల్జియంలను చిత్తు చేసిన భారత్‌ ఈ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మన జట్టు తరఫున వివేక్‌సాగర్‌ ప్రసాద్‌ (12వ ని.లో), వరుణ్‌ కుమార్‌ (30వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (58వ ని.లో), రమణ్‌దీప్‌ సింగ్‌ (58వ ని.లో) తలా ఒక గోల్‌ నమోదు చేశారు. జపాన్‌ తరఫున సెరెన్‌ తనక (14వ ని.లో), షోతాయమడ (43వ ని.లో) చెరో గోల్‌ కొట్టారు. తొలి అంచె ఫైనల్లో బెల్జియం చేతిలో భంగపడ్డ భారత్‌ ఆదివారం జరిగే రెండో అంచె ఫైనల్లో మరోసారి బెల్జియంతో తలపడనుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top