అమెరికా చేతిలో భారత్ ఓటమి | India outplayed by US in women's hockey | Sakshi
Sakshi News home page

అమెరికా చేతిలో భారత్ ఓటమి

Aug 12 2016 11:22 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా చేతిలో భారత్ ఓటమి - Sakshi

అమెరికా చేతిలో భారత్ ఓటమి

రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు మరోసారి నిరాశ పరిచింది.

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు మరోసారి నిరాశ పరిచింది. గ్రూప్-బీ లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అమెరికాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అమెరికా చేతిలో భారత మహిళల జట్టు 3-0 తేడాతో ఓటమి చెందింది. భారత జట్టు తొలి క్వార్టర్స్‌ నుంచి తప్పిదాలు చేస్తూ అమెరికాకు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను ఇచ్చింది. మరోవైపు మొదటి క్వార్టర్‌ నుంచి మ్యాచ్ ముగిసే వరకూ అమెరికా మహిళల జోరు కొనసాగింది. కాథలీన్ బామ్(14వ, 42వ నిమిషాలలో) రెండు గోల్స్ చేయగా, మెలిస్సా గొంజాలెజ్(52 నిమిషం) అమెరికా తరఫున గోల్స్ సాధించారు.

ఇప్పటికే గ్రూప్ నుంచి చివరి స్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు క్వార్టర్స్ అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప భారత్ తర్వాతి రౌండ్ కు వెళ్లే సూచనలు కనిపించడంలేదు. జపాన్, అర్జెంటీనా లు తమ తదుపరి మ్యాచ్ లో ఓడి, భారత్ తమ చివరి మ్యాచ్ లో నెగ్గితేనే క్వార్టర్స్ కు దూసుకెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ లోనూ ఓడితే భారత మహిళలు గెలుపు ఖాతా తెరవకుండానే ఇంటిదారి పట్టినట్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement