అతనొక ఆణిముత్యం: గవాస్కర్ | India Have Found A Gem At No.6 Position: Sunil Gavaskar on Kedar Jadhav | Sakshi
Sakshi News home page

అతనొక ఆణిముత్యం: గవాస్కర్

Jan 23 2017 2:28 PM | Updated on Sep 5 2017 1:55 AM

అతనొక ఆణిముత్యం: గవాస్కర్

అతనొక ఆణిముత్యం: గవాస్కర్

దాదాపు రెండేళ్ల తరువాత భారత్ జట్టులో పునరాగమనం చేసి సత్తా చాటుతున్న భారత ఆల్ రౌండర్ కేదర్ జాదవ్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

కోల్కతా: దాదాపు రెండేళ్ల తరువాత భారత్ జట్టులో పునరాగమనం చేసి సత్తా చాటుతున్న భారత ఆల్ రౌండర్ కేదర్ జాదవ్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలాకాలం తరువాత ఆరోస్థానంలో భారత్ కు లభించిన ఒక ఆణిముత్యమంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. చక్కటి మ్యాచ్ ఫినిషింగ్ లక్షణాలున్న జాదవ్కు ఆరోస్థానం అతికినట్లు సరిపోతుందంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.' ఆరోస్థానం జాదవ్ ఖిల్లా.  ఒక ఆణిముత్యం లాంటి క్రికెటర్ను భారత్ చాలాకాలం తరువాత వెతికిపట్టిందని అనుకుంటున్నా. కేదర్ జాదవ్ బంతిని హిట్ చేసే విధానం చాలా బాగుంది. కచ్చితమైన షాట్లతో భారత్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఆరోస్థానమే అతనికి సరైన స్థానం 'అని గవాస్కర్ తెలిపాడు.

మరొకవైపు భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కోహ్లికి అదేమీ భారం కాదన్నాడు. కెప్టెన్సీ బాధ్యత అతని బ్యాటింగ్ పై ఎటువంటి ప్రభావం చూపదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement