హాంకాంగ్‌తో భారత్‌ తొలి పోరు

India first fighting with Hong Kong - Sakshi

ఆసియా క్రీడల హాకీ షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. హాకీ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పూల్‌ ‘ఎ’లో భారత్‌తోపాటు కొరియా, జపాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 22న హాంకాంగ్‌తో ఆడనున్న భారత్‌ ఆ తర్వాత వరుసగా జపాన్‌ (24న), కొరియా (26న), శ్రీలంక (28న) జట్లతో తలపడుతుంది. పూల్‌ ‘బి’లో పాకిస్తాన్, మలేసియా, బంగ్లాదేశ్, ఒమన్, థాయ్‌లాండ్, ఇండోనేసియా జట్లున్నాయి. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 19న ఇండోనేసియాతో ఆడుతుంది. ఆ తర్వాత కజకిస్తాన్‌ (21న), కొరియా (25న), థాయ్‌లాండ్‌ (27న) జట్లను భారత్‌ ‘ఢీ’కొంటుంది. పురుషుల, మహిళల విభాగంలో విజేతగా నిలిచిన జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top