సెమీస్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ | Income tax teams entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్

May 24 2014 12:19 AM | Updated on Sep 4 2018 5:07 PM

హెచ్‌హెచ్ ఇన్విటేషన్ హాకీ టోర్నీలో ఇన్‌కమ్ ట్యాక్స్, ఏజీఓఆర్‌సీ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో శుక్రవారం ఈ క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది.

ఇన్విటేషన్ హాకీ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌హెచ్ ఇన్విటేషన్ హాకీ టోర్నీలో ఇన్‌కమ్ ట్యాక్స్, ఏజీఓఆర్‌సీ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో శుక్రవారం ఈ క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. దీంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టు 5-4 తేడాతో జింఖానా జట్టుపై గెలుపొందింది.
 
  ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టులో సంజీవి రెండు గోల్స్ చేయగా, అజయ్ శర్మ, అజయ్‌బాబు, సమీర్‌లు ఒక్కో గోల్ చొప్పున చేశారు. జింఖానా ఆటగాళ్లలో మహేశ్ రెండు గోల్స్, అభిమన్యు, సాయి చెరో గోల్ నమోదు చేశారు. ఇక మరో క్వార్టర్ ఫైనల్లో ఏజీఓఆర్‌సీ 6-0 తేడాతో రాయల్ క్లబ్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. ఇన్‌కమ్ ట్యాక్స్, ఏజీఓఆర్‌సీ జట్లు శనివారం జరగనున్న రెండో సెమీఫైనల్లో తలపడనుండగా, నవభారత్ (ఏ), రసూల్‌పురా (ఏ) జట్లు తొలి సెమీఫైనల్లో ఆడనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement