యువ భారత్‌కు మరో గెలుపు | In the Youth ODI series, India under-19 team won in the second match respectively. | Sakshi
Sakshi News home page

యువ భారత్‌కు మరో గెలుపు

Aug 11 2017 3:15 AM | Updated on Sep 17 2017 5:23 PM

యువ భారత్‌కు మరో గెలుపు

యువ భారత్‌కు మరో గెలుపు

యూత్‌ వన్డే సిరీస్‌లో భారత్‌ అండర్‌–19 జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది.

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ అండర్‌–19 ఓటమి
కాంటర్‌బరీ: యూత్‌ వన్డే సిరీస్‌లో భారత్‌ అండర్‌–19 జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో హిమాన్షు రాణా (85 బంతుల్లో 74; 9 ఫోర్లు), అనుకుల్‌ రాయ్‌ (4/27) రాణించడంతో యువ భారత్‌ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 44.4 ఓవర్లలో 175 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రెవస్కిస్‌ (35), లెమొన్‌బై (30) ఫర్వాలేదనిపించారు.

రాహుల్‌ చహర్‌ 3, అభిషేక్‌ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 33.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు), రాణా తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రెండో వికెట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (38 నాటౌట్‌)తో కలిసి రాణా 61 పరుగులు జతచేయడంతో విజయం సులువైంది. ఐదు వన్డేల యూత్‌ సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2–0తో ఆధిక్యంలో ఉంది. శనివారం మూడో వన్డే హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement