చాంపియన్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన | ICCChampionsTrophy: ViratKohli-led 15-member squad includes Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

May 8 2017 12:25 PM | Updated on Sep 5 2017 10:42 AM

చాంపియన్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

చాంపియన్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి  బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా 15మంది సభ్యులతో జట్టును సోమవారం ఖరారు చేసింది. వైస్‌ కెప్టెన్‌గా రహానే, సెకండ్‌ కీపర్‌గా కేదార్‌ జాదవ్‌, ధోని, హార్థిక్‌ పాండే, అశ్విన్‌, మహ్మద్‌ షమి, యువరాజ్‌ సింగ్‌, మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌లకు చోటు దక్కింది. 

అలాగే గాయాల నుంచి కోలుకున్న రోహిత్‌, షమీకి స్థానం దక్కగా హర్భజన్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌కు నిరాశే ఎదురైంది. వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇక రిజర్వ్‌ ఆటగాళ్లుగా రిషబ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సురైనా రైనా కొనసాగనున్నారు.. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్ హోదాలో బగిలోకి దిగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement