ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్ | Ian Thorpe: Olympic swimming legend in rehab after police called | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్

Feb 4 2014 12:53 AM | Updated on Sep 2 2017 3:18 AM

ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్

ఆస్పత్రి పాలైన ఇయాన్ థోర్ప్

ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ విచక్షణ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు.

పునరావాస శిబిరానికి స్టార్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్
 సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ విచక్షణ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. సిడ్నీ (2000), ఏథెన్స్ (2004) ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు గెలుచుకోవడమే కాకుండా ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు గె లుచుకున్న తొలి అథ్లెట్‌గానూ 31 ఏళ్ల థోర్ప్ పేరు తెచ్చుకున్నాడు.
 
-     పూర్తి షాక్‌లో ఉన్న తను తెల్లవారుజాము 3 గంటలకు సిడ్నీలోని ఓ కుటుంబానికి చెందిన వ్యాన్‌లో కూర్చునేందుకు ప్రయత్నిస్తుండగా 14 ఏళ్ల కుర్రాడు పోలీసులకు ఫోన్ చేశాడు.
-     దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు థోర్ప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తను పూర్తి దిగ్భ్రమకు లోనై ఉండడమే కాకుండా మత్తులో ఉన్నట్టు తెలిపారు.
-     అయితే తాము అదుపులో తీసుకున్నది థోర్ప్ అని పోలీసులు వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. థోర్ప్‌ను ఆస్ప్రతికి తీసుకెళ్లడం గత రెండు వారాల్లో రెండోసారి కావడం గమనార్హం.
  -   అయితే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తాము కూడా ఏ చర్యలు తీసుకోలేదని పోలీసులు చెప్పారు.
-     థోర్ప్ మేనేజిమెంట్ ఈ ఘటనపై స్పందించనప్పటికీ అతడు డిప్రెషన్ చికిత్స కోసం పునరావాస శిబిరానికి వెళ్లినట్టు తెలిపింది. పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్ వల్లే థోర్ప్ స్పృహలో లేకుండా కనిపించాడని చెప్పింది.
 -    2006లో కెరీర్ నుంచి తప్పుకున్నాక అతడి జీవితం గతి     తప్పింది. 2011లో పునరాగమనం చేసినా... జాతీయ జట్టు ట్రయల్స్‌లో విఫలమై 2012 ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి థోర్ప్ కోలుకోలేకపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement