కరోనాతో ఒలింపిక్‌ చాంపియన్‌ కన్నుమూత

Hungarian Olympic Champion Diana Igaly Dies Of Corona - Sakshi

హంగేరి షూటర్‌ డయానాను కబళించిన మహమ్మారి

బుడాపెస్ట్‌: ప్రపంచ షూటింగ్‌ క్రీడాలోకంలో విషాదం చోటు చేసుకుంది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ అయిన హంగేరి మహిళా షూటర్‌ డయానా ఇగాలేను కరోనా మహమ్మారి కబళించింది. 56 ఏళ్ల డయానా కరోనా వైరస్‌ లక్షణాలతో మంగళవారం ఆసుపత్రిలో చేరగా... శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచింది.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్కీట్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గిన డయానా... 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా షూటింగ్‌ క్రీడాంశంలో స్వర్ణం నెగ్గిన తొలి హంగేరి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె అంతర్జాతీయస్థాయిలో 32 పతకాలు గెల్చుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top