
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదు
ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో చెత్త షాట్ ఆడినందుకు, ఆ రోజు రాత్రి నిద్రపోలేదని రహానె చెప్పాడు.
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అజింక్యా రహానె నిలకడగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్తో గత మ్యాచ్లో రహానె 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అంతకుముందు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో చెత్త షాట్ ఆడినందుకు, ఆ రోజు రాత్రి నిద్రపోలేదని రహానె చెప్పాడు. ఈ నెల 1న ముంబైతో జరిగిన మ్యాచ్లో రహానె 16 పరుగుల వద్ద వినయ్ కుమార్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు.
'చెత్త షాట్ ఆడినందుకు తాను చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపా. ఆ షాట్ గురించి, జట్టు పరాజయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను' అని రహానె చెప్పాడు. రహానె తర్వాతి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్లో రహానె 400 పైచిలుకు పరుగులు చేశాడు.