
న్యూఢిల్లీ: ‘కెప్టెన్సీ నాకో కొత్త సవాల్. నాయకుడిగా తర్వాతి అడుగు ఎలా వేస్తానో మీరెవరూ ఊహించలేరు. ఓపెనర్లు మిడిలార్డర్‌లో ఆడొచ్చు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఓపెనింగ్‌కు దిగొచ్చు. అంచనాలకు అందకుండా వ్యూహాలు రూపొందిస్తా’ అని ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొత్త కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
మంగళవారం జెర్సీ ఆవిష్కరణలో పంజాబ్ టీమ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి పాల్గొన్న అశ్విన్ మాట్లాడుతూ... ‘నేను సెహ్వాగ్, యువీల కెప్టెన్సీలో ఆడాను. వారి అనుభవం, సలహాలను ఉపయోగించుకోవడంలో వెనక్కి తగ్గను’ అని పేర్కొన్నాడు. భారత పరిమిత ఓవర్ల జట్టులో పునరాగమనానికి ఐపీఎల్‌ను వేదికగా భావించడం లేదని చెప్పాడు.