ఐదోస్థానంలో చల్లా చైతన్య | Hyderabads Chaitanya Challa in fifth spot | Sakshi
Sakshi News home page

ఐదోస్థానంలో చల్లా చైతన్య

Jul 26 2018 10:07 AM | Updated on Sep 4 2018 5:53 PM

Hyderabads Chaitanya Challa in fifth spot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇసుజు ఆర్‌ఎఫ్‌సీ ఇండియా ఆఫ్‌రోడ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ రేసర్‌ చల్లా చైతన్య మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవాలో జరుగుతోన్న ఈ రేసులో మూడోరోజు పోటీలు ముగిసేసరికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యంత కఠినమైన, ప్రత్యేకమైన 6–9 స్టేజ్‌లు పూర్తయ్యేసరికి చైతన్య (కో డ్రైవర్‌ శబరీశ్‌ జాగారపు) నిర్ణీత 900 పాయింట్లకు గానూ 526 పాయింట్లు సాధించి ఐదోస్థానంలో ఉన్నాడు.

చండీగఢ్‌కు చెందిన సన్‌బీర్‌ సింగ్‌ ధలివాల్‌ 687 పాయింట్లతో అగ్రస్థానంలో, కూర్గ్‌కు చెందిన వెటరన్‌ డ్రైవర్‌ జగత్‌ నంజప్ప 669 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. మలేసియా డ్రైవర్‌ మెర్విన్‌ లిమ్‌ 567 పాయింట్లతో మూడోస్థానాన్ని దక్కించుకోగా, నాలుగో స్థానంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుర్మీత్‌ విర్దీ (చండీగఢ్, 565) ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement