మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ | Harikrishna Pentala looks to bounce back in Geneva FIDE Grand Prix | Sakshi
Sakshi News home page

మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ

Jul 6 2017 12:56 AM | Updated on Sep 5 2017 3:17 PM

మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ

మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ

వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా... భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ గురువారం మొదలయ్యే జెనీవా ఫిడే గ్రాండ్‌ప్రి టోర్నీ బరిలోకి దిగనున్నాడు.

జెనీవా (స్విట్జర్లాండ్‌): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా...  భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ గురువారం మొదలయ్యే జెనీవా ఫిడే గ్రాండ్‌ప్రి టోర్నీ బరిలోకి దిగనున్నాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్‌ల స్విస్‌ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ఈనెల 15న ముగుస్తుంది. ‘మాస్కో టోర్నీ తర్వాత లభించిన ఖాళీ సమయంలో జెనీవా టోర్నీకి సిద్ధమయ్యాను. గతంలోకంటే మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను’ అని హరికృష్ణ అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement