అశ్విన్‌పై హర్భజన్‌ విమర్శలు | Harbhajan Singh for comments on Ravichandran Ashwin | Sakshi
Sakshi News home page

అశ్విన్‌పై హర్భజన్‌ విమర్శలు

Jan 11 2019 2:05 AM | Updated on Jan 11 2019 2:05 AM

Harbhajan Singh for comments on Ravichandran Ashwin - Sakshi

ముంబై:  ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫిట్‌నెస్‌ తీరును మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తీవ్రంగా తప్పు పట్టాడు. జట్టు ప్రధాన స్పిన్నర్‌ సొంతగడ్డపై మాత్రమే వికెట్లు తీస్తూ విదేశాల్లో గాయాలకు గురవుతున్నా డంటే ఆందోళన చెందాల్సిన అంశమని అతను అన్నాడు. ‘ఇంగ్లండ్‌లో తొలి టెస్టులో మాత్రమే అశ్విన్‌ రాణించాడు. ఆ తర్వాత అతను పదును కోల్పోవడంతో పాటు గాయాలపాలయ్యాడు. అడిలైడ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్‌కు మరో 3 వికెట్లు తీసేందుకు ఏకంగా 52 ఓవర్లు అవసరమయ్యాయంటే విదేశాల్లో అతని పేలవ రికార్డు ఏమిటో తెలుస్తుంది’ అని భజ్జీ విరుచుకు పడ్డాడు. జడేజా, కుల్దీప్‌లనే మున్ముందు అశ్విన్‌కు బదులుగా ప్రధాన స్పిన్నర్లుగా తుది జట్టులోకి తీసుకోవాలని అతను సూచించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement