ధోని అంటే తెలియని వారు ఉన్నారా? | Graeme Smith Praises MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోని అంటే తెలియని వారు ఉన్నారా?

Jul 13 2020 10:37 AM | Updated on Jul 13 2020 10:49 AM

Graeme Smith Praises MS Dhoni - Sakshi

కేప్‌టౌన్‌: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిస్టర్‌ కూల్‌ ఎమ్‌ ఎస్‌ ధోనిని దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌, మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్‌ కనెక్ట్‌ పేరుతో నిర్వహిస్తున్న ఒక స్పోర్ట్స్‌ షోలో ఆయన మాట్లాడారు. అసలు ధోని తెలియని  వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం వ్యక్తం చేశాడు. ధోని అంటే తెలియన వారు ఎవరూ ఉండరంటూ స్మిత్‌ కొనియాడాడు. ఇంకా ధోని  గురించి మాట్లాడుతూ, అతను చాలా సౌమ్యుడని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ప్రశంసించారు. ధోని అంటే తనకి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్మిత్‌ తో పాటు గౌతమ్‌ గంభీర్‌ కూడా పాల్గొన్నారు. 

చదవండి: 'ధోనికున్న మ‌ద్ద‌తు కోహ్లికి లేదు'

ధోని గురించి గంభీర్‌ మాట్లాడుతూ, తామిద్దరం రూమ్‌ మేట్స్‌ అని తెలిపారు. నెల రోజుల పాటు తామిద్దరం కలిసి ఒకే రూం లో ఉన్నామని, మాహీ చాలా మంచి వ్యక్తి అని గంభీర్‌ పేర్కొన్నారు. చిన్న రూంలో ఉన్న తామిద్దరం ఆ రూం పెద్దగా కనిపించడం కోసం  మంచాలు తీసేసి బెడ్స్‌ వేసుకొని నేలపై పడుకునే వారమని చెప్పారు. ఇక ధోని, తాను ఎప్పుడు జుట్టు గురించే మాట్లాడుకేనే వారమన్నారు. ధోనికి అప్పట్లో పొడుగాటి హెయిర్‌ స్టైల్‌ ఉండేది. అలా జుట్టును మెయిన్‌టైన్‌ చేయడం చాలా కష్టమని గంభీర్‌ తెలిపారు. ఇంకా ధోనితో కలిసి కెన్యా, జింబాంబ్వే, ఇండియా ఏ టూర్‌కు వెళ్లనని ఆ టూర్‌ బాగా ఎంజాయ్‌ చేశామని గంభీర్‌ చెప్పారు. ధోని సారధ్యంలో భారత్‌  2007 టీ20 ప్రపంచకప్‌, 2011లో వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ధోని తన చివరి మ్యాచ్‌ 2019 వరల్డ్‌ కప్‌లో  ఆడారు. తరువాత ధోని రిటైర్డ్‌మెంట్‌ ప్రకటించారు.

చదవండి: భార‌త అభిమానుల గుండె ప‌గిలిన రోజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement