లారా సేవలు అవసరం:వార్న్

లారా సేవలు అవసరం:వార్న్


సిడ్నీ:తిరోగమనంలో పయనిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ ను బ్రతికించుకోవాలంటే ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా సేవలు అవసరమని ఆసీస్ మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెట్ చాలా పేలవంగా సాగుతున్న కారణంగా లారాకు వెస్టిండీస్ జట్టులో కీలక బాధ్యత అప్పగించాలని వార్న్ సూచించాడు.


 


'ప్రస్తుతం వెస్టిండీస్ కు లారా సేవలు అవసరమని భావిస్తున్నా. ఆస్ట్రేలియాతో హోబార్ట్ లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 212 పరుగుల తేడాతో ఓటమి చెందింది. కనీసం పోరాడకుండానే విండీస్ వరుస ఓటములు చూడటం నిజంగా బాధాకరమే. ఈ పరిస్థితుల్లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన లారా సూచనలు జట్టుకు కచ్చితంగా అవసరం. వెస్టిండీస్ తరపున అత్యధిక టెస్టు పరుగులు(11,953) చేయడమే కాకుండా, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు(400 నాటౌట్), ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 501 పరుగులతో అజేయంగా ఉన్నటువంటి అరుదైన ఘనతలు లారా పేరిటే ఉన్నాయి.  ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గుర్తిస్తే మంచిది' అని వార్న్ పేర్కొన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top