ఎకెల్‌స్టోన్‌పై అవినీతి విచారణ | Formula 1: Ecclestone to face Germany bribery charges | Sakshi
Sakshi News home page

ఎకెల్‌స్టోన్‌పై అవినీతి విచారణ

Jan 17 2014 1:32 AM | Updated on Aug 1 2018 4:17 PM

ఎకెల్‌స్టోన్‌పై అవినీతి విచారణ - Sakshi

ఎకెల్‌స్టోన్‌పై అవినీతి విచారణ

ఫార్ములావన్ బాస్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోనున్నారు.

బెర్లిన్: ఫార్ములావన్ బాస్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోనున్నారు. 2006లో ఎఫ్1 చాంపియన్‌షిప్ హక్కుల అమ్మకం విషయంలో జర్మనీ మాజీ బ్యాంకు అధికారి గెర్హార్డ్ గ్రిబ్కోస్కీకి 45 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపాడని ఎకెల్‌స్టోన్‌పై అభియోగం ఉంది.

‘విచారణ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. ఏప్రిల్ చివర్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది’ అని మ్యూనిచ్ కోర్టు తెలిపింది. లంచం ఆశ చూపిన కేసులో జర్మన్ చట్టాల ప్రకారం మూడు నెలల నుంచి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అయితే ఈ ఆరోపణలను ఎకెల్‌స్టోన్ న్యాయవాదులు తోసిపుచ్చారు. మరోవైపు ఫార్ములావన్ బోర్డు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఎకెల్‌స్టోన్ ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement