breaking news
Ecclestone
-
టీమిండియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ
భారత మహిళలతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నాట్ స్కివర్ బ్రంట్ సారథ్యం వహించనుంది. ఇక క్రికెట్ నుంచి తత్కాలిక విరామం తీసుకున్న స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేసింది. గత నెలలో స్వదేశంలో వెస్టిండీస్‌తో మహిళలతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లకు ఎక్లెస్టోన్ దూరంగా ఉంది. మానసిక ఒత్తడి కారణంగా కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని సోఫీ నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు టీమిండియా సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ తన మనసును మార్చుకుంది. ఎక్లెస్టోన్ రాకతో మరో స్పిన్నర్ సారా గ్లెన్ జట్టులో చోటు కోల్పోయింది. అదేవిధంగా గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20లో గాయపడిన మాజీ కెప్టెన్ హీథర్ నైట్ ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సిరీస్‌కు ఆమె దూరంగా ఉండనుంది.ఈ టీ20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్ తర్వాత భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మరోవైస భారత పురుషల జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్టికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, సరణ్య గఢావ్, క్రాంతి గఢ్వ్ రెడ్డిభారత వన్డే జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారెడ్, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారే. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుకెక్కింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో క్యాథరిన్ ఆల్‌టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
వారెవా వ్యాట్... సిక్సర్ సోఫీ..!
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్...మ్యాచ్ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్యానీ వ్యాట్ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. శతక భాగస్వామ్యం... ఓపెనర్ బీమాంట్ (7), కెప్టెన్ హీతర్ నైట్ (1), సివర్ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. టపటపా... 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన లౌరా వాల్వార్ట్ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. -
ఎకెల్‌స్టోన్‌పై అవినీతి విచారణ
బెర్లిన్: ఫార్ములావన్ బాస్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోనున్నారు. 2006లో ఎఫ్1 చాంపియన్‌షిప్ హక్కుల అమ్మకం విషయంలో జర్మనీ మాజీ బ్యాంకు అధికారి గెర్హార్డ్ గ్రిబ్కోస్కీకి 45 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపాడని ఎకెల్‌స్టోన్‌పై అభియోగం ఉంది. ‘విచారణ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. ఏప్రిల్ చివర్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది’ అని మ్యూనిచ్ కోర్టు తెలిపింది. లంచం ఆశ చూపిన కేసులో జర్మన్ చట్టాల ప్రకారం మూడు నెలల నుంచి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అయితే ఈ ఆరోపణలను ఎకెల్‌స్టోన్ న్యాయవాదులు తోసిపుచ్చారు. మరోవైపు ఫార్ములావన్ బోర్డు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఎకెల్‌స్టోన్ ప్రకటించారు.