ముంబైపై గోవా విజయం

FC Goa win goal-fest against Mumbai City in ISL - Sakshi

ముంబై: సొంత ప్రేక్షకుల మధ్య ముంబై సిటీ ఎఫ్‌సీ తడబడింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2–4 గోల్స్‌ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గోల్స్‌ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్‌ (27వ ని.), ఫెర్రాన్‌ కొరొమినస్‌ (45వ ని.), హ్యూగో బొవుమౌస్‌ (59వ ని.), కార్లోస్‌ పెన (89వ ని.) తలా ఓ గోల్‌ చేశారు. ముంబై తరఫున సార్థక్‌ గోలుయ్‌ (49వ ని.), సౌవిక్‌ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్‌ సాధించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top