
నాగ్‌పూర్: భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తనకు ఏనుగంత జ్ఞాపకశక్తి ఉందని నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టి ప్రపంచరికార్డు నెలకొల్పిన అశ్విన్‌ను మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.
‘నీ 100వ, 200వ, 300వ వికెట్ బాధితులెవరని ప్రశ్నిస్తూ’.. అశ్విన్ జ్ఞాపకశక్తిని పరీక్షించాడు. దీనికి అశ్విన్ ముంబైలో100వ వికెట్ డారెన్ సామీ, కాన్పూర్‌లో 200వ వికెట్ కన్నే విలియమ్సన్, నాగ్‌పూర్‌లో 300వ వికెట్ గామెజ్ అని టకాటకా సమాధానం ఇచ్చాడు. ఇక భవిష్యత్తుపై ప్రశ్నించగా ‘నేను ఇప్పటికి 50 టెస్టులు మాత్రమే ఆడాను. ఇప్పుడు సాధించిన వికెట్ల సంఖ్యను భవిష్యత్తులో రెట్టింపు చేస్తాననే నమ్మకం ఉంది’...అని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. డేవిడ్ వార్నర్‌ను పలుమార్లు అవుట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా క్యారమ్ బంతులు వేయడంలేదు. అందుకే ఆ బంతి వేసి ఈ మైలు రాయి అందుకున్నాని తెలిపాడు. గత కొంత కాలంగా దొరికిన విశ్రాంతి కలిసొచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
.@coach_rsridhar quizzes Milestone man @ashwinravi99. Watch the full interview on https://t.co/uKFHYe2Bag #Ash300 pic.twitter.com/yIvRpGrBGD
— BCCI (@BCCI) 27 November 2017
అశ్విన్ ప్రధాన వికెట్ బాధితులు
తొలి వికెట్ : డారెన్ బ్రావో (వెస్టిండీస్)
50వ వికెట్ : నిక్ కాంప్టన్( ఇంగ్లండ్)
100వ వికెట్ : డారెన్ సామీ( వెస్టిండీస్)
150వ వికెట్ : ఇమ్రాన్‌తాహీర్(వెస్టిండీస్)
200వ వికెట్ : కన్నె విలియమ్సన్( న్యూజిలాండ్)
250వ వికెట్ : ముష్పికర్ రహీమ్( బంగ్లాదేశ్)
300వ వికెట్ : గామెజ్ (శ్రీలంక)