ద్రవిడ్‌కు రెండు ఆప్షన్స్‌ ఇస్తే..

Dravid opted for Under 19 over IPL, Vinod Rai - Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చినప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌కి రెండు అవకాశాలు ఇవ్వగా అతను అండర్-19 జట్టుకి కోచ్‌గా ఉండేందుకు మొగ్గుచూపినట్లు బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెల్లడించారు. లోధా కమిటీ సంస్కరణ అమలు కోసం సుప్రీంకోర్టు నేతృత్వంలో సీఓఏ ఏర్పాటైంది. . దీనిలో భాగంగా ఐపీఎల్‌లో ఓ జట్టుకి కోచ్‌గా ఉంటూ.. భారత అండర్-19 జట్టుకి కూడా రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా పనిచేయడం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని పెద్ద ఎత్తున చర్చని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అతను అండర్-19 జట్టుకి మాత్రమే కోచ్‌గా ఉండేందుకు ఒప్పుకున్నట్లు రాయ్ తాజాగా వెల్లడించారు.

‘రాహుల్ ద్రవిడ్‌కి అప్పట్లో రెండు ఆప్షన్స్‌ ఇచ్చాం. అందులో ఒకటి.. ఐపీఎల్‌లో కోచ్‌గా కొనసాగడం. రెండోది భారత అండర్-19 జట్టుకి కోచ్‌గా ఏడాదికాలం కాంట్రాక్ట్. ఆ సమయంలో ద్రవిడ్ మరో ఆలోచన లేకుండా అండర్-19 టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. అలా పనిచేసేందుకు అమోదయోగ్యమైన ప్యాకేజీని కోరాడు’ అని వినోద్ రాయ్ వివరించారు. భారత్‌లో మాత్రమే విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top