ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నా లీ, సిబుల్కోవా | Dominika Cibulkova, Li Na advances to Australian Open final | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నా లీ, సిబుల్కోవా

Jan 23 2014 3:15 PM | Updated on Sep 2 2017 2:55 AM

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నా లీ, సిబుల్కోవా

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నా లీ, సిబుల్కోవా

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ పోరుకు చైనా స్టార్ నా లీ, స్లోవికియా తార డొమినికా సిబుల్కోవా సిద్ధమయ్యారు.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ పోరుకు చైనా స్టార్ నా లీ, స్లోవికియా తార డొమినికా సిబుల్కోవా సిద్ధమయ్యారు. రెండుసార్లు రన్నరప్ అయిన నా లీ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారమిక్కడ జరిగిన సెమీ ఫైనల్లో  కెనడా యువ క్రీడాకారిణి యుజీన్ బౌచర్డ్ను వరుస సెట్లలో ఓడించింది. 6-2, 6-4తో చిత్తు చేసింది.

మరో మ్యాచ్లో 20వ సీడ్ సిబుల్కోవా, 5వ సీడ్ రద్వాన్‌స్కాను కంగుతినిపించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. 70 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్  6-1, 6-2తో రద్వాన్‌స్కాను సిబుల్కోవా ఓడించింది. మేజర్ టెన్నిస్ టోర్నిలో ఆమె ఫైనల్ ప్రవేశించడం ఇదే మొదటిసారి.

Advertisement
 
Advertisement
Advertisement