‘వారిదే అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌’ | Dhoni And Fleming Are Best Captain Coach Combination | Sakshi
Sakshi News home page

‘వారిదే అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌’

Aug 15 2019 3:40 PM | Updated on Aug 15 2019 3:45 PM

Dhoni And Fleming Are Best Captain Coach Combination - Sakshi

సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని-స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌లదేనని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ధోని ఉండగా, కోచ్‌గా ఫ్లెమింగ్‌ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆ జట్టు సభ్యుడిగా ఉన్న వాట్సన్‌.. తాను ఇప్పటివరకూ చూసిన కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌లో ధోని-ఫ్లెమింగ్‌లదే అగ్రస్థామంటూ కొనియాడాడు.  సీఎస్‌కేను సమన్వయంగా నడపడంతో పాటు ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో వీరిది కీలక పాత్ర అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రవేశపెట్టిన తర్వాత సీఎస్‌కే ఒక సక్సెస్‌ఫుల్‌ జట్టుగా ఉందంటే అందుకు కారణం ధోని కెప్టెన్సీతో పాటు ఫ్లెమింగ్‌ కోచింగ్‌ పర్యవేక్షణే కారణమన‍్నాడు.

‘చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)తో నా అనుభవం చాలా ప్రత్యేకమైనది.. ఆహ్వానించదగినది. నేను ఆడిన అత్యధిక లీగ్‌ మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫునే ఆడాను. ఇప్పటివరకూ సీఎస్‌కే కచ్చితమైన మార్గంలో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇందుకు ఆ జట్టుకు ఉన్న సరైన ప్రణాళికే కారణం. ఇందులో ధోని-ఫ్లెమింగ్‌ల పాత్రే అమోఘం. వరల్డ్‌లోనే ఆ ఇద్దరిదీ అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ అని నేను బలంగా నమ్ముతాను’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement