ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు | dedeepya, sindhu, AITA, దేదీప్య, సింధు, ఐటా | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు

Aug 1 2017 10:50 AM | Updated on Sep 17 2017 5:03 PM

ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు

ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు.

 

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సాయిదేదీప్య 6–3, 1–6, 7–5తో సృష్టి దాస్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, సింధు 6–3, 6–3తో ప్రియాంక (మహారాష్ట్ర)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య, తమిళనాడుకు చెందిన అద్వైత శరవణన్‌తో తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా తీర్థ 5–7, 1–6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో, మౌళిక రామ్‌ 4–6, 3–6తో అవిష్క గుప్తా (జార్ఖండ్‌) చేతిలో ఓడిపోయారు.


 

Advertisement
 
Advertisement
Advertisement