breaking news
dedeepya
-
ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సాయిదేదీప్య 6–3, 1–6, 7–5తో సృష్టి దాస్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, సింధు 6–3, 6–3తో ప్రియాంక (మహారాష్ట్ర)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య, తమిళనాడుకు చెందిన అద్వైత శరవణన్‌తో తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా తీర్థ 5–7, 1–6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో, మౌళిక రామ్ 4–6, 3–6తో అవిష్క గుప్తా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయారు. -
సెమీఫైనల్లో ప్రాంజల, దేదీప్య
ఫెనెస్టా టెన్నిస్ టోర్నీ న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణులు ప్రాంజల, సాయి దేదీప్య, షేక్ హుమేరా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన విష్ణువర్ధన్ కూడా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 6-2, 6-1తో జెన్నిఫర్ లుఖమ్పై గెలుపొందగా, నిధి చిలుముల 7-6 (7/0), 3-6, 2-6తో రియా భాటియా చేతిలో పరాజయం పాలైంది. షర్మదా బాలు 7-5, 6-4తో వైదేహి చౌదరిపై గెలిచింది. అండర్-18 బాలికల క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షేక్ హుమేరా 7-6, 4-6, 7-5తో యమలపల్లి సహజపై, సారుు దేదీప్య 6-2, 6-3తో తనీషా కశ్యప్‌పై నెగ్గారు. లలిత దేవరకొండ 6-2, 6-1తో ఉర్మి పాండ్యను ఓడించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-4తో దల్విందర్ సింగ్‌పై విజయం సాధించాడు.