ఇంగ్లండ్‌లో బాదుడు షురూ చేసిన ఏబీ! 

De Villiers Starts In Middlesex Victory in T20 Blast - Sakshi

43 బంతుల్లో 88 పరుగులు 6ఫోర్లు, 5 సిక్సర్లు. రిటైర్మెంట్‌ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌. ఐపీఎల్‌ వంటి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో మిడిలెస్సెక్స్‌ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పసిపిల్లలయ్యారు. లార్డ్స్‌ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఎస్సెక్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెస్సెక్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 39 పరుగులకే రెండు వికెట్లు​ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్‌ మలాన్‌తో కలిసి డివిలియర్స్‌ రెచ్చిపోయాడు. వీర్దిదరూ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే మిడిలెస్సెక్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక తొలిసారి టీ20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ ఆటకు సంబంధించిన వీడియోను లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top