స్మిత్‌ బాటలోనే వార్నర్‌..

David Warner follows Steve Smith and Cameron Bancroft - Sakshi

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం తన సహచర ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, బాన్‌ క్రాఫ్ట్‌ బాటలోనే నడుస్తానని అంటున్నాడు. తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేయబోనని వార్నర్‌ స్పష్టం చేశాడు. అసలు క్రికెట్‌ ఆ‍స్ట్రేలియా తరపున ఇక క్రికెట్‌ ఆడలేనేమోనంటూ ఇటీవల పేర్కొన్న వార్నర్‌.. తనపై విధించిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

‘నాపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన శిక్ష సరైనదే అనుకుంటున్నా. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆ క్రమంలో నిషేధంపై అప్పీల్‌ చేసుకుని అవకాశం సీఏ ఇచ్చిన అందుకు ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు' అని వార్నర్‌ తెలిపాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్‌ స్మిత్‌ , బాన్‌ క్రాఫ్ట్‌లు తమపై సీఏ విధించిన శిక్షను సవాలు చేయబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతామన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top