స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడు: లీమన్

Darren Lehmann Worried About Suspended Cricketers - Sakshi

వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ల కెరీర్ అయిపోలేదు

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్‌కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్ (ఎన్‌పీఎస్‌)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9నెలల పాటు నిషేధం ఉన్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని చెప్పాడు లీమన్.

స్థానిక రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్యాంపరింగ్ వివాదంపై మరోసారి లీమన్ స్పందించారు. ‘స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు చాలా మంచివాళ్లు. పొరపాటున తప్పు చేశారు. వారిపై నిషేధం పూర్తయ్యాక మళ్లీ జాతీయ జట్టులో ఆడతారని నమ్మకం ఉంది. వారిపై నిషేధం ముగిసేవరకు రోజూ బాధపడతాను. వాళ్లు ఆసీస్‌కు మళ్లీ ఆడి దేశ ప్రతిష్టను రెట్టింపు చేస్తారు. స్మిత్ మళ్లీ కెప్టెన్‌ అవుతాడు. అదృష్టవశాత్తూ అందరూ వారి తప్పుల్ని క్షమించేశారని’ లీమన్ వివరించాడు. నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్‌కు ట్రాయ్ కూలీ, ర్యాన్ హ్యారిస్, క్రిస్ రోజర్స్‌లతో కలిసి లీమన్ సేవలందించనున్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top