హోటల్‌లో విలియమ్సన్‌ను ఆడుకున్నారు | Dancing Yuvraj Singh Puts Cake on Kane Williamson | Sakshi
Sakshi News home page

హోటల్‌లో విలియమ్సన్‌ను ఆడుకున్నారు

Apr 21 2017 4:05 PM | Updated on Sep 5 2017 9:20 AM

హోటల్‌లో విలియమ్సన్‌ను ఆడుకున్నారు

హోటల్‌లో విలియమ్సన్‌ను ఆడుకున్నారు

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించాక సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించాక సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. సన్‌ రైజర్స్ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మైదానంలో అయినా, బయట అయినా సరదాగా ఉంటాడు. ఇక ఏదైనా ఫంక్షన్ అయితే డ్యాన్స్‌ చేసి అదరగొడతాడు. తాజాగా ఢిల్లీతో ఐపీఎల్‌ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత హోటల్‌ వచ్చాక సన్‌ రైజర్స్ ఆటగాళ్లు కేక్‌ కట్‌ చేసి సెలెబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా యువీ స్టెప్పులేసి ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్‌ (51 బంతుల్లో 89)కు కేక్ తినిపించేందుకు హైదరాబాద్‌ ఆటగాళ్లు పోటీపడ్డారు. కాగా తన ముఖానికి కేక్‌ పూస్తారని ముందే భావించిన విలియమ్సన్‌ రెండు చేతులతో ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నించగా, యువీ వచ్చి వెనుక నుంచి అతన్ని పట్టుకుని చేతులు తీసేందుకు ప్రయత్నించాడు. ఇతర ఆటగాళ్లు విలియమ్సన్‌కు కేక్ తినిపిస్తూ అతని ముఖానికంతా కేక్‌ పూశారు. విలియమ్సన్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆటగాళ్లు వదల్లేదు. అందరూ కలసి సరదాగా  అతనితో ఓ ఆటాడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement