ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా అద్భుతంగా రాణించింది.
ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా అద్భుతంగా రాణించింది. గురువారం జరిగిన మ్యాచ్ అంత ఈజీగా గెలిచేది కాదు కనుకనే భారత్ ఓడిపోయింది. సెమీస్లో గెలిచినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు. కంగారూలు చాలా బాగా రాణించారు. స్మిత్ సెంచరీకి తోడు.. ఫించ్ అర్ధ శతకంతో రాణించాడు. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర వరుసగా నాలుగు సెంచరీలు సాధించి రికార్డులకెక్కాడు. - క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
వెల్ డన్ టీమిండియా. - షూటర్ అభినవ్ బింద్రా
సెమీస్లో గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఫైనల్లో న్యూజిలాండ్తో కూడా ఇదే తరహాలో ఆసీస్ గెలవాలి. - షేన్ వార్న్
ఇండియా ఈ టోర్నీలో చాలా బాగా ఆడింది. కానీ ఆసీస్ కూడా చక్కగా రాణించింది. ఆసీస్ ఫైనల్కు వెళ్లటం సమంజసమే.
- యువరాజ్ సింగ్.
ఇండియా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడినందుకు గర్వపడాలి. కానీ నేటి మ్యాచ్లో మాత్రం ఆసీస్ బాగా ఆడింది.
- వీవీఎస్ లక్ష్మణ్
ఎంఎస్ ధోని నాయకత్వం బేష్. ధోని మంచి నాయకుడు, ఆటగాడు కూడా. ఏడు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ నేటి సెమీస్లో ఓడిపోవటం బాధాకరం. - పాకిస్తాన్ స్పిన్నర్ అజ్మల్
వెల్ డన్ ఆస్ట్రేలియా. సెమీస్లో చాలా బాగా ఆడింది. - బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.