వారం పేరు తప్పేసి... అచ్చేశారు 

Commonwealth Games organisers 'gutted' after 14000 incorrect - Sakshi

కామన్వెల్త్‌ ప్రారంభోత్సవ టికెట్లలో అచ్చుతప్పులు

సిడ్నీ: ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరం ముస్తాబైంది. అయితే ప్రారంభోత్సవ టికెట్లను అచ్చుతప్పులతో ముద్రించి నిర్వాహకులు అభాసుపాలయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ మొదలవుతున్న రోజు బుధవారమైతే గురువారం అని ముద్రించడం విమర్శలపాలైంది. ఏప్రిల్‌ 4న నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకల్ని గురువారం అని 14 వేల టికెట్లలో ముద్రించారు. నిజానికి ఏప్రిల్‌ 4 బుధవారం. తప్పుదొర్లిన మాట నిజమేనని అంగీకరించిన నిర్వాహకులు తిరిగి సరిదిద్దుకొని ముద్రించే ఆలోచనేది లేదని స్పష్టం చేశారు.

‘అంతా సవ్యం గానే సాగుతున్న దశలో తప్పుగా టికెట్లు అచ్చువేయడం నిరాశపరిచింది. ప్రింటింగ్‌ సంస్థ ఇలాంటి తప్పు చేసి ఉండాల్సింది కాదు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సింది. అయితే ఇప్పటికే ఏప్రిల్‌ 4వ తేదీ ప్రారంభోత్సవమని పాకిపోయింది. మళ్లీ బుధవారమని ముద్రించాల్సిన అవసరం లేదు. ఈ టికెట్లే చెల్లుబాటవుతాయి ’ అని గేమ్స్‌ చీఫ్‌ పీటర్స్‌ మీడియాతో అన్నారు.  

Back to Top