ప్రపంచకప్ వేదికలుగా ఫ్రాన్స్ (1998), దక్షిణాఫ్రికా (2010)లను ఎంపిక చేసేందుకు తమకు లంచాలు ఇచ్చారని ఫుట్‌బాల్ .....
1998, 2010 ప్రపంచకప్ వేదికల ఎంపిక కోసం
జెనీవా: ప్రపంచకప్ వేదికలుగా ఫ్రాన్స్ (1998), దక్షిణాఫ్రికా (2010)లను ఎంపిక చేసేందుకు తమకు లంచాలు ఇచ్చారని ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ (ఫిఫా) అధికారికంగా అంగీకరించింది. ఈ మేరకు యూఎస్ అధికారులకు పంపిన 21 పేజీల లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరల్డ్‌కప్ వేదికల ఎంపికలో భారీ అవినీతికి పాల్పడిన ఫిఫా అధికారులపై యూఎస్ విచారణ జరుపుతోంది. ‘అవినీతి బాగోతంలో మిలియన్ల కొద్ది డాలర్లు చేతులు మారాయి. ఇందులో 41 సంస్థల ఎగ్జిక్యూటివ్స్, మాజీ అధికారులకు ప్రమేయం ఉంది’ అని ఫిఫా తెలిపింది.