అపూర్వీకి మరో స్వర్ణం | 'Best shooter' Apurvi Chandela wins another gold in Sweden | Sakshi
Sakshi News home page

అపూర్వీకి మరో స్వర్ణం

Jan 8 2016 1:08 AM | Updated on Sep 3 2017 3:16 PM

భారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిలో తన అద్భుత ప్రదర్శన మరోసారి కొనసాగించింది. గురువారం జరిగిన 10 మీ. ట్రై సిరీస్

షూటర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపిక
 న్యూఢిల్లీ: భారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిలో తన అద్భుత ప్రదర్శన మరోసారి కొనసాగించింది. గురువారం జరిగిన 10 మీ. ట్రై సిరీస్ ఈవెంట్ ఫైనల్లోనూ 208.9 పాయింట్లతో స్వర్ణం కొల్లగొట్టింది. మంగళవారం నాటి పోటీలో 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో పాటు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 23 ఏళ్ల చండీలా ‘షూటర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికైంది. అలాగే ఈ రాజస్తానీ షూటర్‌కు వాల్తెర్ రైఫిల్‌ను బహుమానంగా అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement