ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం | Best Border-Gavaskar Trophy Tests: No.6 | Sakshi
Sakshi News home page

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

Sep 17 2016 1:07 AM | Updated on Sep 4 2017 1:45 PM

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ’ఎ’కు పట్టు చిక్కింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే...

భారత్ ‘ఎ’తో అనధికారిక టెస్టు
బ్రిస్బేన్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ’ఎ’కు పట్టు చిక్కింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 150 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కార్ట్‌రైట్ (153 బంతుల్లో 99 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్), నిక్ మ్యాడిసన్ (114 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (79) చెలరేగారు. శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు  3 వికెట్లు తీశాడు. 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ఆ తర్వాత కోలుకుంది. కార్ట్‌రైట్, వెబ్‌స్టర్ ఐదో వికెట్‌కు 152 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు మ్యాడిసన్, ప్యాటర్‌సన్ మూడో వికెట్‌కు 92 పరుగులు జత చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
 
Advertisement
Advertisement