‘బెస్ట్‌’ బోల్ట్, సిమోన్‌ బైల్స్‌ | Best Bolt, Simon Bales | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌’ బోల్ట్, సిమోన్‌ బైల్స్‌

Feb 16 2017 12:07 AM | Updated on Sep 5 2017 3:48 AM

‘బెస్ట్‌’ బోల్ట్, సిమోన్‌ బైల్స్‌

‘బెస్ట్‌’ బోల్ట్, సిమోన్‌ బైల్స్‌

క్రీడా ‘ఆస్కార్‌’గా పేరొందిన ప్రతిష్టాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ పురస్కారాల్లో జమైకా మేటి అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్, అమెరికా సంచలన

మొనాకో: క్రీడా ‘ఆస్కార్‌’గా పేరొందిన ప్రతిష్టాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ పురస్కారాల్లో జమైకా మేటి అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్, అమెరికా సంచలన జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ మెరిశారు. మొనాకోలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో... 2016 సంవత్సరానికిగాను ఉసేన్‌ బోల్ట్, సిమోన్‌ బైల్స్‌ వరుసగా ఉత్తమ క్రీడాకారుడు, క్రీడాకారిణి పురస్కారాలను దక్కించుకున్నారు.

గతేడాది రియో ఒలింపిక్స్‌లో బోల్ట్‌ మూడు స్వర్ణాలు, సిమోన్‌ బైల్స్‌ నాలుగు స్వర్ణాలు సాధించారు. ఓవరాల్‌గా బోల్ట్‌కిది నాలుగో లారెస్‌ అవార్డు. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు ఈ పురస్కారాన్ని గెల్చుకున్న ఫెడరర్, సెరెనా విలియమ్స్‌ (టెన్నిస్‌), కెల్లీ స్లేటర్‌ (సర్ఫింగ్‌) సరసన బోల్ట్‌ చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement