బెంచ్‌ వార్మర్స్‌ జట్టుకు టైటిల్‌ | bench warmers wins basket ball title | Sakshi
Sakshi News home page

బెంచ్‌ వార్మర్స్‌ జట్టుకు టైటిల్‌

Dec 25 2017 10:36 AM | Updated on Sep 4 2018 5:32 PM

bench warmers wins basket ball title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ క్లబ్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బెంచ్‌ వార్మర్స్‌ జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. సికింద్రాబాద్‌ క్లబ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో బెంచ్‌ వార్మర్స్‌ 64–46తో వైఎంసీఏ సికింద్రాబాద్‌పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.

విజేత జట్టు తరఫున గోపి 22 పాయింట్లతో చెలరేగగా, రోహిత్‌ (19 పాయింట్లు), శ్రీకాంత్‌ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. వైఎంసీఏ జట్టులో పీటర్‌ (14), వీరేశ్‌ (10), పృథ్వీ (10) రాణించారు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో బెంచ్‌ వార్మర్స్‌ 64–62తో సికింద్రాబాద్‌ క్లబ్‌పై గెలుపొందగా, సికింద్రాబాద్‌ వైఎంసీఏ 60–57తో ఎయిర్‌బార్న్‌ క్లబ్‌ను ఓడించింది.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement