రెండో వన్డేలో ఇంగ్లండ్కు షాక్ | bangladesh stun england by 34 runs in second one day | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో ఇంగ్లండ్కు షాక్

Oct 10 2016 10:31 AM | Updated on Sep 4 2017 4:54 PM

రెండో వన్డేలో ఇంగ్లండ్కు షాక్

రెండో వన్డేలో ఇంగ్లండ్కు షాక్

మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్కు బంగ్లాదేశ్ షాకిచ్చింది.

మిర్పూర్:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. బంగ్లాదేశ్ విసిరిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడిన ఇంగ్లండ్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లా పేస్ బౌలర్ల అటాక్ కు విలవిల్లాడిన ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బంగ్లా బౌలర్లు మష్రాఫ్ మోర్తజా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మరో పేసర్ తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.

 

ఇంగ్లండ్ 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో బెయిర్ స్టో(35), బట్లర్(57)లు రాణించడంతో కాస్త తేరుకున్నట్లు కనిపించింది. కాగా, వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇంగ్లండ్ మిగతా ఆటగాళ్లలో రషిద్(33 నాటౌట్), బాల్(28) మోస్తరుగా రాణించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో మొహ్మదుల్లా(75), మోర్తజా(44)లు రాణించారు. ఈ తాజా విజయంతో బంగ్లాదేశ్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే. మూడో వన్డే బుధవారం జరుగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement