మళ్లీ ‘శత’క్కొట్టిన మోమినుల్‌

Bangladesh draw first Test against Sri Lanka - Sakshi

 శ్రీలంక, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు డ్రా  

చిట్టగాంగ్‌: మోమినుల్‌ హక్‌ (105; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాయంతో... శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్‌ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 81/3తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన మోమినుల్‌ హక్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక విజయంపై ఆశలు వదులుకుంది.  మోమినుల్‌తోపాటు లిటన్‌ దాస్‌ (94; 11 ఫోర్లు) కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 180 పరుగులు జోడించారు. మోమినుల్‌ హక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బంగ్లా తరఫున ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా మోమినుల్‌ హక్‌ రికార్డు సృష్టించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top