
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తొమ్మిది నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ నేటి నుంచి మళ్లీ సీనియర్ ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. శనివారంతో అతనిపై నిషేధం ముగిసింది. దాంతో బిగ్‌బాష్ టి20 లీగ్ జట్టు పెర్త్ స్కార్చర్స్ తమ 13 మంది సభ్యుల జట్టులోకి బాన్‌క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది.
ఆదివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. 26 ఏళ్ల బాన్‌క్రాఫ్ట్ ఆస్ట్రేలియా తరఫున 8 టెస్టులు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. స్మిత్, వార్నర్‌లపై మార్చి 29 వరకు నిషేధం కొనసాగనుంది.